Advertisementt

ఈ యువ హీరోకి కాశీ నేపథ్యం కలిసొస్తుందా?

Wed 01st Apr 2015 02:16 AM
sundeep kishan,tiger,indra movie,kaasi  ఈ యువ హీరోకి కాశీ నేపథ్యం కలిసొస్తుందా?
ఈ యువ హీరోకి కాశీ నేపథ్యం కలిసొస్తుందా?
Advertisement
Ads by CJ

యువ కథానాయకుడు సందీప్‌కిషన్ హిట్ అనే మాట విని చాలా కాలం అయింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఈ హీరోకి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సందీప్ సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘టైగర్’ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.  ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్‌కపూర్ కథానాయిక. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాశీ నేపథ్యంలో సాగే  ఈ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ తన కెరీర్‌ను ఊపందుకునేలా చేస్తుందని సందీప్ ఆశిస్తున్నాడు. అంతేకాదు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి కలిసొచ్చినట్టుగా ‘టైగర్’కు కూడా కాశీ నేపథ్యం కలిసొస్తుందని ఆశతో వున్నాడు సందీప్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ