రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ చిత్రంపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ చిత్రం మే 15న విడుదల కాదని, దీనిని పోస్ట్‌పోన్ చేస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ ఇంకా లేటవ్వడం వల్ల జులై 30న విడుదల చేయనున్నారని, గతంలో రాజమౌళి తీసిన బ్లాక్‌బస్టర్ ‘మగధీర’ని కూడా అదే సమయంలో విడుదల చేసిన రాజమౌళి మరోసారి ‘మగధీర’ సెంటిమెంట్‌ను ఫాలో అవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ‘మగధీర’కు, ‘బాహుబలి’కి చాలా తేడా ఉందని, ‘మగధీర’కు లేని చాలాప్లస్ పాయింట్స్ ‘బాహుబలి’కి ఉన్నాయని, ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నందువల్ల సమ్మర్‌లో రిలీజ్ చేయడమే ఉత్తమమని అంటున్నారు. వేసవి సెలవుల్లో ఈ సినిమా వచ్చి సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఈ చిత్రం కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తుందని, అదే జులైలో అయితే అంత ఊపు ఉండదని తేలుస్తున్నారు. వాస్తవానికి ‘మగధీర, ఈగ’ చిత్రాలు రెండు హిట్ అయి ఉండవచ్చు గాక కానీ ఈ రెండు చిత్రాలను రాజమౌళి సమ్మర్‌కు విడుదల చేసివుంటే కలెక్షన్లు ఇంకా బాగా పెరిగివుండేవని వాదిస్తున్నారు. కాబట్టి ‘బాహుబలి’కి వేసవి సెలవులే బాగా కలిసొస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది.