సాధారణంగా కవులు గొంత సవరించుకోవడం కామనే. కవి సమ్మేళనాల్లో వారు తరచు స్వీయ కవితాగానం వినిపిస్తారు. సి.నారాయణరెడ్డి చాలా చక్కగా కవితాలాపన చేస్తారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ‘గాయం’ చిత్రంలో పాట పాడుతూ తనే తెరపై కనిపిస్తాడు. ఇక చంద్రబోస్‌కు సరైన అవకాశం వచ్చిందంటే చాలు... ఫంక్షన్లలో గొంతు సవరించుకుంటాడు. అయితే రామజోగయ్య శాస్త్రి పరిస్థితి వేరు. ఆయన అడపాదడపా తెరపై తళుక్కున మెరుస్తుంటాడు. ఇప్పుడు దానికి తోడుగా పాట కూడా పాడాడు. కమల్‌హాసన్ తాజా చిత్రం ‘ఉత్తమవిలన్’ డబ్బింగ్ వెర్షన్‌కు ఆయన సాహిత్యం అందించారు. అక్కడితో ఆగకుండా ఓ పాట కూడా పాడాడట. ఇది హిట్ అయితే తరచు మనకు శాస్త్రిగారి స్వరం వినే భాగ్యం కలుగుతుంది.