Advertisementt

సహనం కోల్పోయిన పివిపి...!

Tue 31st Mar 2015 07:06 AM
pvp,telugu industry heroines,sruthihasan,thamanna  సహనం కోల్పోయిన పివిపి...!
సహనం కోల్పోయిన పివిపి...!
Advertisement
Ads by CJ
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల తీరుపై ప్రముఖ నిర్మాత, సినీ ఫైనాన్షియర్‌ ప్రసాద్‌.వి.పొట్లూరి మండిపడ్డాడు. శృతిహాసన్‌ ఉన్నట్లుండి తన ప్రాజెక్ట్‌ నుండి తప్పుకొని కాంట్రాక్ట్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఆయన సహనం కోల్పోయారు. ఇప్పటి హీరోయిన్లు కాంట్రాక్ట్‌ పేపర్లను టాయిలెట్‌ పేపర్లలా ఉపయోగిస్తున్నారని మండిపడ్డాడు. పివిపి సహనం కోల్పోయి ఇలా మాట్లాడటం 
అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. కాగా తమ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నందుకు శృతిహాసన్‌పై కోర్టులో కేసు వేస్తూనే ఆ స్ధానంలో తమన్నాను తీసుకునేందుకు ఆయన సిద్దమవుతున్నాడు. మొత్తానికి నేటి హీరోయిన్ల తీరు మాత్రం సరిగ్గా లేదని మాత్రం అందరూ ఒప్పుకొంటున్నారు. అయితే పివిపి మరీ ఇలా సహనం కోల్పోయి మాట్లాడటం తగదని, అందరు హీరోయిన్లను ఒకే గాటిన కట్టడం తప్పని కొందరు వాదిస్తున్నారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ