Advertisementt

పవన్‌ దారిలో వెంకీ....!

Tue 31st Mar 2015 07:04 AM
  పవన్‌ దారిలో వెంకీ....!
పవన్‌ దారిలో వెంకీ....!
Advertisement
Ads by CJ

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరైపోతారనే సామెత ఉంది. దీనికి ఉదాహరణగా పవన్‌కళ్యాణ్‌, వెంకటేష్‌లను చెప్పుకోవచ్చు. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత తమ తదుపరి చిత్రం విషయంలో ఒకరిని మించి మరొకరు సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. సీనియర్‌ స్టార్‌ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారు కొంతకాలం ఎప్పుడో అప్పుడు గ్యాప్‌ ఇచ్చారు కానీ తన కెరీర్‌ ప్రారంభమైన తర్వాత వెంకటేష్‌ మాత్రం గ్యాప్‌ తీసుకోలేదు. కానీ తాజాగా ఆయన ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత ఏకంగా మూడు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. రవితేజతో కలిసి చేస్తున్నాడని కొంత సేపు, రానాతో కలిసి చేస్తున్నాడని కొంతసేపు, దశరథ్‌ దర్శకత్వంలో సోలో హీరోగా చేస్తున్నాడని .. కాదు కాదు.. తమిళ డైరెక్టర్‌తో చేస్తున్నాడని.. ఇలా వార్తలు మీద వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ వెంకీ నోరు విప్పి తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఇది అని అనౌన్స్‌ చేయలేదు. మరి ఇంతకీ వెంకీ మేకప్‌ వేసుకోవడానికి మరెంత సమయం తీసుకుంటాడో వేచిచూడాల్సి వుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ