'ఎన్.హెచ్ 10' సినిమాతో నిర్మాతగా, నటిగా అనుష్క శర్మ విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా బాగున్నాయి. విభిన్న కథతో రూపొందిన ఈ సినిమా విజయవంతం కావడంతో అనుష్క మరిన్ని సినిమాలను నిర్మించాలనుకుంటుంది. సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్టేట్ ఫిల్మ్స్ పతాకంపై రెండవ సినిమాను నిర్మిస్తుంది. 'ఢిల్లీ బెల్లీ' ఫేం అక్షత్ వెర్మ ఈ సినిమాకు దర్శకుడు. అక్షత్ వెర్మ సినిమాలో అనుష్క శర్మ నటించడం లేదు. కేవలం నిర్మాత మాత్రమే.
'ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. అక్షత్ వెర్మది చాలా చిన్న సినిమా. నాలాంటి స్టార్ హీరోయిన్ నటించాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. నేను నిర్మించబోయే మరో సినిమాలో నటించే అవకాశం ఉంది. కథను బట్టి నేను ఆ సినిమాలో నటించాలా..? వద్దా..? అనే నిర్ణయం తీసుకుంటాను. అని అనుష్క శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.