Advertisementt

మహేష్ 'బ్రహ్మోత్సవం' ఓపెనింగ్ విశేషం ఇదే!

Tue 31st Mar 2015 06:19 AM
mahesh babu brahmotsavam,krishna birthday,special of brahmotsavam opening,srikanth addala  మహేష్ 'బ్రహ్మోత్సవం' ఓపెనింగ్ విశేషం ఇదే!
మహేష్ 'బ్రహ్మోత్సవం' ఓపెనింగ్ విశేషం ఇదే!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకేక్కబోయే సినిమా  'బ్రహ్మోత్సవం'. తండ్రి పుట్టినరోజు కానుకగా మే 31న పూజా కార్యక్రమాలతో లాంచనంగా ఈ సినిమాను ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నారట. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మహేష్, శ్రీకాంత్ అడ్డాల కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఆ సినిమా తరహాలో 'బ్రహ్మోత్సవం' కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. దర్శకుడు చెప్పిన కథ మహేష్ బాబును ఇంప్రెస్ చేసింది. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ చేయాలనుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'శ్రీమంతుడు' పూర్తయిన 'బ్రహ్మోత్సవం' రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఎంపికైందని మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకనిర్మాతలు కన్ఫర్మ్ చేయలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ