అన్నపూర్ణ ఏడు ఎకరాలలో 'బాహుబలి' కోసం కళా దర్శకుడు సాబు సిరిల్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ సెట్ రూపొందింది. సెట్ లోపలికి ఎవ్వరినీ వెళ్ళనివ్వడం లేదు. కీరవాణి స్వరపరిచిన ప్రత్యేక గీతాన్ని నోరా ఫతేహి మరో ఇద్దరు తారలపై ఇక్కడే చిత్రికరించనున్నారు. మరో రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఆల్రెడీ సాంగ్ రిహార్సెల్స్‌తో తారలంతా బిజీగా ఉన్నారు. 'బాహుబలి'కి సంభందించిన ఏ ఒక్క విషయాన్ని రాజమౌళి బయటకు రానివ్వడం లేదు. చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కానీ, నోరా ఫతేహి అత్యుత్సాహం వలన ఈ ప్రత్యేక గీతం వార్త బయటకు వచ్చేసింది.