ఏప్రిల్ ఎండింగ్ నుండి 'గబ్బర్ సింగ్ 2' సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ నెలాఖరున లేదా మే మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రొడక్షన్ హౌస్ సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమాకు మళ్లీ దర్శకుడు మారుతున్నాడు అని వచ్చిన వార్తలను అవాస్తవమని పేర్కొన్నారు. 'పవర్' ఫేం కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. సంపత్ నంది స్థానంలో బాబీ మినహా ముందుగా ప్రకటించిన టీం అంతా 'గబ్బర్ సింగ్ 2'కు పని చేస్తారు.
పవన్ సరసన 'అలియాస్ జానకి' ఫేం అనిషా ఆంబ్రోస్ కథానాయికగా నటిస్తుంది. మరో ముద్దుగుమ్మకు కూడా కథలో చోటుందని సమాచారం. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ క్రేజీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడైనా అనుకున్న సమయానికి మొదలవుతుందో..? లేదో..?