రాజకీయాల్లోనే కాదు... సినిమా రంగంలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవం. దానికి ఉదాహరణగా శ్రీనువైట్లతో తగవు పడి బయటకు వచ్చిన రచయితలు కోనవెంకట్, గోపీమోహన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తానికి రామ్‌చరణ్ పుణ్యమా అని మరలా వీరందరూ కలిసి పని చేయడానికి సిద్దమవుతున్నారు. ఇక శ్రీనువైట్ల, ప్రకాష్‌రాజ్‌ల మధ్య వివాదం అయితే మూలమూలకు పాకిపోయింది. ఇద్దరు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఒకరు రాసిన కవితను మరొకరు సెటైరిక్‌గా సినిమాలో సైతం పెట్టేసుకున్నారు. కాగా ఇప్పుడు శ్రీనువైట్ల , ప్రకాష్‌రాజ్‌లు కూడా కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా రామ్‌చరణ్ సినిమాలోనే అని సమాచారం. మొత్తానికి ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఇంతకాలం ఒకరిని వెనకేసుకొస్తూ, మరొకరిపై తీవ్రంగా విరుచుకుపడిన వారి సన్నిహితులు మాత్రం ఈ పరిణామం చూసి షాకవ్వుతున్నారు.