Advertisementt

బహుచక్కని కమల్ హాసన్ కవిత తెలుగు లో!

Sun 29th Mar 2015 06:16 AM
  బహుచక్కని కమల్ హాసన్ కవిత తెలుగు లో!
బహుచక్కని కమల్ హాసన్ కవిత తెలుగు లో!
Advertisement
Ads by CJ

గురువు బాలచందర్ అంటే కమల్ హాసన్ కు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసి, గొప్ప నటుడిగా తీర్చిదిద్దిన బాలచంద్రుడిపై తమిళంలో ఓ కవిత రాశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి ఆ కవితను అనువదించారు.  

మాలో కళయను ధాన్యపురాశి

ధన్యతనొందగ దోసిట దూసి

పై పై పొరల పొట్టును వొలిచి

మట్టిని రాళ్ళను పక్కన విడిచి

ఒల్లని దానిని జల్లెడ పట్టి

విషయము మాత్రము పిడికిట పట్టి

జనతా ప్రియమగు రుచిగా తేల్చిన పాక ప్రవీణా

అహమూ గర్వము అడుగున అణిచి

అణకువుగా మా కళను పొంగించి

అభినయమను అరిటాకును పరచి

ఇదివరకెరుగని విందుగా మమ్ముల

జగతికి పంచిన సాంకేతిక నిపుణా

సంతలో బేరము తిరుగ

ముక్కలు ముక్కలుగా తెగనమ్మెడి సమయము

నన్నొక బంగారు దుస్తును చెయ్యగ

దర్జీ అవతారము ఎత్తిన గురూజీ మీరు

మీ ఋణమేనాటికి తీర్చగలను నన్ను కనుగొన్న నాన్నా

ఇలపై ఇకపై మీలా ఎవరూ

రారను మాటను తప్పని చెప్పగ

అనుభవమంతా నేర్పించారు

మీరే మేమై ప్రతిపని చెయ్యగ

మీ వెలుగును తడిసిన పుడమికి

పున్నమి గుబాళింపుగా

రేపటి కళాపూర్ణుడొకడు

ఉదయించుట తధ్యము

ఆ బాలచంద్రుడిని కడుపున పెంచి

కళామతల్లికి అందించాలని

వేచి చూస్తుంది రేపటి తరం

వేనోళ్ళగా పిలుస్తుంది మా ఇంటి గర్భం

విని వదిలేసి చిరు విషయముగా మిము

మరిచిన మరచిన కాలము కదలదు ముందుకు

ఆకసమంటిన శిఖరముగా మీ

అంతులేని కథ విని కొనియాడగ

ఇంటింట వేలిసేరు అభిమానులు

తరగారు గాక శతకోటి తరములు

కనుమరుగైనా చేరని కిటుకును

సాఫల్య జీవన సరళిగా మాకందించిన

దార్శనికులు పితృసమానులు మీరు

చిరంతరంగా మీ యశస్సు

వర్ధిల్లాలని కోరుకుంటోంది

మా గుప్పెడు మనసు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ