Advertisementt

స్టార్ హీరోలందరూ తమన్ చేతిలో బందీలు!

Sun 29th Mar 2015 01:35 AM
star heroes,ss thaman,allu arjun,ram charan,balakrishna,ss thaman music director  స్టార్ హీరోలందరూ తమన్ చేతిలో బందీలు!
స్టార్ హీరోలందరూ తమన్ చేతిలో బందీలు!
Advertisement
Ads by CJ

ఇక తమన్ పనైపోయింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా కెరటంలా ఎగసిపడ్డాడు. 2013లో 11 సినిమాలకు సంగీతం అందిస్తే.. బాద్షా, బలుపు విజయం సాధించాయి. గత ఏడాది తమన్ సంగీతం అందించిన రేసుగుర్రం, పవర్ మినహా మిగతా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. రొటీన్ బీట్స్ తప్ప తమన్ సంగీతంలో కొత్తదనం లేదని విమర్శలు. దాంతో ఇక తమన్ హవా తగ్గినట్లే అని భావించారు. అనూహ్యంగా స్టార్ హీరోల సినిమాలు చేజిక్కించుకుని విమర్శలకు జలక్ ఇచ్చాడు తమన్.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్', అల్లు అర్జున్ - బోయపాటిల సినిమా, రామ్ చరణ్ - శ్రీను వైట్ల 'మై నేమ్ ఈజ్ రాజు', రవితేజ కిక్ 2, రామ్ పండగ చేస్కో సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోలందరూ తమన్ సంగీతానికి బందీలు అయ్యారు. బాలకృష్ణ సినిమాకు తొలిసారిగా సంగీతం అందిస్తున్నాడు. మిగతా హీరోలందరితో ఆల్రెడీ హిట్ కొట్టాడు. మరోసారి సక్సెస్ సెంటిమెంట్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అల్ ది బెస్ట్ తమన్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ