అమితాబ్ బచ్చన్.. ప్రతి సినిమా ద్వారా ఏదో ఒక కొత్త ప్రయోగం చేయడం ఆయనకు అలవాటు. రొటీన్ చిత్రాలకు దూరంగా సరికొత్తవేషాలతో ఈ వయసులో కూడా ఆయన ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. ఇప్పటికే ‘పా, షమితాబ్, భూతునాథ్ రిటర్న్స్’ చిత్రాలలో ఆయన చేసిన ప్రయోగాలలో కేవలం కొన్నిమాత్రమే. కాగా ఈ నిత్యవిద్యార్ది త్వరలో ‘పీకు’లో మరో వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఆయనకు కూతురిగా దీపికాపడుకొనే నటిస్తోంది. డయాలసిస్‌తో వీల్‌చైర్‌కే పరిమితమయ్యే ఆ పాత్రలో అమితాబ్ అద్బుతంగా నటించాడని, ఈ చిత్రంతో మరోసారి ఆయన జాతీయ అవార్డును సంపాదిస్తాడని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.