సూపర్ స్టార్ కృష్ణకు ప్రస్తుత తరం హీరోలలో ఎవరంటే ఇష్టం..? మరో ఆలోచన లేకుండా మహేష్ బాబు అని ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు. నటనలో, పద్ధతిలో తండ్రికి తగ్గ తనయుడిగా కృష్ణ గౌరవాన్ని మహేష్ బాబు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో నిలిపారు. మహేష్ బాబు తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమని కృష్ణ చెప్పారు. నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణ చెప్పిన ఈ వార్త ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. నిజమే ప్రభాస్ కటౌట్ అలాంటిది. మాస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలలో నటించి మెప్పించాడు. మంచితనంతో ఇండస్ట్రీలో అందరి డార్లింగ్ అయ్యాడు.
సూపర్ స్టార్ కృష్ణ, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కలిసి దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించడం విశేషం. పలు సినిమాలలో కృష్ణ హీరోగా, కృష్ణంరాజు విలన్ పాత్రలో నటించారు. ఇప్పటికి వీరిద్దరూ మంచి స్నేహితులు.