టీం ఇండియా వరల్డ్ కప్ ఓటమి ఎఫెక్ట్ ఎవరిపై ఎంతుందో..? తెలియదు గానీ, ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్కలపై బాగా ఉంది. వీరిద్దరూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇండియా ఓటమికి అనుష్క కారణమంటూ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. గతంలో విరాట్ వెంట కొన్ని క్రికెట్ టోర్నమెంట్లకు అనుష్క హాజరయింది. తాజాగా వర్ల్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం సిడ్నీ వెళ్ళింది. ఒక్క టోర్నమెంట్లో కూడా ఇండియా విజయం సాధించలేదు. దాంతో అనుష్కను ఐరన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. దారుణంగా కామెంట్ చేస్తున్నారు.
ఇండియా ఓటమికి అనుష్కను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు కరెక్ట్..? అని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రశ్నిస్తుంది. ఒక మహిళ అని, శక్తి లేదని ఆమెపై విమర్శలు చేస్తున్నారు. విరాట్ సెంచరీ చేసినప్పుడు, ఇండియా విజయం సాధించినప్పుడు వీరు ఏమయ్యారు..? మనం ప్రతిసారి విన్ అవ్వలెం. టీం ఇండియాను చూస్తే గర్వంగా ఉంది. ఒత్తిడిలో కూడా బాగా ఆడారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అని సానియా మీర్జా ట్వీట్ చేసింది.