Advertisementt

మరో ఇంటివాడైన ధనుష్‌!

Thu 26th Mar 2015 11:31 AM
dhanush,bombay,dhanush own house in mumbai,raghuvaran btech,shamitabh  మరో ఇంటివాడైన ధనుష్‌!
మరో ఇంటివాడైన ధనుష్‌!
Advertisement
Ads by CJ

అసలు ఓ హీరోకు ఉండాల్సిన లక్షణాలే లేని స్టార్‌ ధనుష్‌. తమిళంలో ఆయనకు మంచి క్రేజ్‌ ఉంది. ఇక రజనీకాంత్‌కు అల్లుడైన తర్వాత ధనుష్‌కు  తిరుగేలేకుండా పోయింది. అయితే ధనుష్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్నాడు. బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తున్నాడు. హిందిలో ధనుష్‌ ఇప్పటివరకు చేసిన రెండు చిత్రాలు విమర్శకులనే  కాదు... ప్రేక్షకులను కూడా మెప్పించి ధనుష్‌కు బాలీవుడ్‌లో ఓ స్థానం ఏర్పరిచాయి. ప్రస్తుతం ధనుష్‌ తమిళంలో రెండు, బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తున్నాడు. ముంబై టు చెన్నై ప్రయాణాలతో అలసిపోతున్నాడు. అంతేగాక స్టోరీ డిస్కషన్స్‌ వంటి వాటికి, నిర్మాతలతో నిరంతరం టచ్‌లో ఉండటం ఇబ్బందిగా మారుతుండటంతో ఇటీవల ధనుష్‌ ముంబైలోని అంధేరిలో భారీ ధరకు ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి అందులో బస చేయాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి ధనుష్‌ మామూలోడు కాదు అంటున్నారు అందరూ...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ