Advertisementt

శృతిపై మరోసారి అలాంటి వార్త!

Thu 26th Mar 2015 09:24 AM
shruti haasan,srimanthudu,nagarjuna,karthi,gossip on shruti haasan,mahesh babu movie  శృతిపై మరోసారి అలాంటి వార్త!
శృతిపై మరోసారి అలాంటి వార్త!
Advertisement
Ads by CJ

స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ ఆమధ్య డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో మహేష్‌బాబు`కొరాటాల శివ చిత్రం ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రం నుండి వైదొలిగిందని వార్తలు వచ్చాయి. అయితే శృతిహాసన్‌ వెంటనే స్పందించి ఆ వార్తలు అవాస్తవం అని తేల్చిచెప్పింది. ఇప్పుడు అదే తరహా వార్తలు మరోసారి కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో వస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున, కార్తీలు హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమా పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ కీలకమైన పాత్రలో నటిస్తోంది. కాగా మరోసారి శృతిహాసన్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నట్లు టాలీవుడ్‌లో మరీ ముఖ్యంగా కోలీవుడ్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరి ఇది కూడా ఎంత మాత్రం నిజం? అనేది తెలియడం లేదు. ఈ విషయమై శృతిహాసనే మీడియా ముందుకు వచ్చి అసలు విషయం తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ