Advertisementt

పోరాటానికి సంసిద్దం అవుతోన్న ‘రుద్రమదేవి’!

Thu 26th Mar 2015 08:06 AM
rudramadevi,nitya menon,allu arjun,lion,fighting of rudhramadevi  పోరాటానికి సంసిద్దం అవుతోన్న ‘రుద్రమదేవి’!
పోరాటానికి సంసిద్దం అవుతోన్న ‘రుద్రమదేవి’!
Advertisement
Ads by CJ

గుణశేఖర్‌ స్వీయదర్శకత్వంలో 70కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో అనుష్క, అల్లుఅర్జున్‌, నిత్యామీనన్‌, కృష్ణంరాజు వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే ఆడియో కూడా విడుదలయింది. ఇక కొంచెం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ మిగిలివుంది. సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని గుణశేఖర్‌ నిర్ణయించడంతో ఈ చిత్రానికి భారీపోటీ తప్పేలా లేదు. మే 15న ‘బాహుబలి’, మే 1న ‘లయన్‌’ వచ్చేట్లు ఉన్నాయి. ఇక ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం ఓ వారం ఆలస్యంగా ఏప్రిల్‌ 2న కాక ఏప్రిల్‌ 9న వస్తుందని వినిపిస్తోంది. అదే జరిగితే ఏప్రిల్‌ 23న ‘రుద్రమదేవి’ని ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశ్యంలో గుణశేఖర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం విడుదలైతే అల్లుఅర్జున్‌ నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి’ ఒకే నెలలో విడుదలకానున్నాయి. అలాగే నిత్యామీనన్‌కు కూడా ఒకే నెలలో రెండు సినిమాలు విడుదలైన ఘనత దక్కుతుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ