Advertisementt

టాప్ తమిళ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా..!.!

Thu 26th Mar 2015 07:48 AM
trivikram,surya,poorijagannath,vv vinayak,mass movie  టాప్ తమిళ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా..!.!
టాప్ తమిళ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా..!.!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. అభిమానుల కోరిక మేరకు సూర్య తెలుగు సినిమాలో నటించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్స్ ని కలిసాడు. కానీ వారు చెప్పిన స్టొరీ లైన్స్ సూర్యను మెప్పించలేకపోయాయి. ఆయన తెలుగులో చేయబోయే మొదటి సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సూర్య సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే వీరిద్దరు రెండుసార్లు కలిసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సూర్య సొంత బ్యానర్ లోనే తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం సూర్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మాస్' సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ