తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్టింగ్‌లో ప్రదాన భూమిక పోషించిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. హైదరాబాద్‌లో ‘అన్నపూర్ణ స్టూడియోస్’ను నెలకొల్పి తెలుగు సినీ పరిశ్రమకు ఇతోదిక సాయం అందించారు. ఈ స్టూడియోను డెవలప్ చేయడంలో ఆయన కుమారులు వెంకట్, నాగార్జునకు కూడా తీవ్రంగా శ్రమపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎందరో నటీనటులను, దర్శకులను, ఇతర సాంకేతిక నిపుణులను ఈ సంస్థ అందించింది. కానీ ఇటీవల అక్కినేని ఫ్యామిలీ బ్యాంకులకు కట్టాల్సిన దాదాపు 62 కోట్లు కట్టలేకపోవడంతో ఈ స్టూడియోకు సంబంధించిన భూమిని బ్యాంకులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అక్కినేని ఫ్యామిలీ కొన్ని పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నుండి వైజాగ్‌కు షిఫ్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి చెందిన కొన్ని ఆస్తులను అమ్మేసినట్లు తెలుస్తోంది..!