Advertisementt

ప్రేక్షకులకు అమీ, సమంత ల డబుల్‌ ధమాకా!

Wed 25th Mar 2015 05:17 AM
amy jackson,samantha,vip movie,dhanush  ప్రేక్షకులకు అమీ, సమంత ల డబుల్‌ ధమాకా!
ప్రేక్షకులకు అమీ, సమంత ల డబుల్‌ ధమాకా!
Advertisement
Ads by CJ

సమంత, అమీజాక్సన్‌ ఇద్దరూ టాప్‌ హీరోయిన్స్‌. వీరిద్దరూ ఒకే సినిమాలో ఉంటే ఇంక చెప్పేదేముంది. రసజ్ఞులకు పండుగే పండుగ. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. ‘షమితాబ్‌, అనేగన్‌’ చిత్రాలతో భారత సినీ జనాలను ఆకట్టుకుంటున్న నటుడు ధనుష్‌ సరసన వీరిద్దరూ ఒకేసినిమాలో హీరోయిన్స్‌గా చేస్తున్నారు.అంతకు ముందు వేల్‌రాజ్‌ దర్శకత్వంలో విడుదలైన ‘వేలై ఇల్లా పట్టదారి’ (తెలుగులో ‘రఘువరన్‌ బి.టెక్‌’) వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కేవలం 5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం 50కోట్లకు పైగా వసూలు చేసి సంచలనాలు నమోదు చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు మళ్లీ అదే టీమ్‌ మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రంలో సమంత, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.‘విఐపి’ చిత్రం యూనిట్‌ అంతా కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో ‘విఐపి2’ అని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ