Advertisementt

మహేష్‌ కి మరదలు అవుతుందట!

Tue 24th Mar 2015 01:38 PM
mahesh babu,srimanthudu,koratala siva,karunya chowdary  మహేష్‌ కి మరదలు అవుతుందట!
మహేష్‌ కి మరదలు అవుతుందట!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’(వర్కింగ్‌ టైటిల్‌). కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్‌ను ఇటీవల ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వదిలారు. ఇలా లీకైన సాంగ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌కు ఓ మరదలు ఉంటుందిట. మహేష్‌ను ఆటపట్టించే ఆ కొంటె మరదలు వర్దమాన నటి కారుణ్య చౌదరి అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమే స్వయంగా తెలియజేసింది. ప్రస్తుతం షూటింగ్‌ వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్‌తో పాటు ఆయన అభిమానులకు కూడా బోలెడు ఆశలు ఉన్నాయి. ‘1’(నేనొక్కడినే), ‘ఆగడు’ చిత్రాల డిజాస్టర్స్‌ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ ఈ చిత్రంపై ఆశలు రేగుతున్నాయి. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు మల్టీమిలియనీర్‌గా, ప్లేబోయ్‌ టైపు పాత్రను చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి ఈచిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ రానుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ