Advertisementt

నెక్స్ట్ అజిత్ డైరెక్టర్ ఇతనే..!

Tue 24th Mar 2015 01:34 PM
ajith,siva director,director siva next movie,ajith with siva,veeram  నెక్స్ట్ అజిత్ డైరెక్టర్ ఇతనే..!
నెక్స్ట్ అజిత్ డైరెక్టర్ ఇతనే..!
Advertisement
Ads by CJ

తమిళ క్రేజీస్టార్‌ అజిత్‌ గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ఇటీవల చేసిన ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రం సూపర్‌హిట్‌ అయింది. ఇక అజిత్‌ తదుపరి చిత్రం దర్శకుడు ఎవరు? అనే విషయంపై ప్రస్తుతం కోలీవుడ్‌లో టాపిక్‌ నడుస్తోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తాడని, లేదా వెంకట్‌ప్రభుకు అవకాశం ఇచ్చే ఉద్దేశ్యం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అజిత్‌ తన తదుపరి చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. అజిత్‌కు పోయిన సంక్రాంతికి ‘వీరం’ వంటి హిట్టు ఇచ్చిన దర్శకుడు శివ. ఈయన టాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో ఆయన ‘శౌర్యం, శంఖం, దరువు’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక కార్తి హీరోగా తెలుగు ‘విక్రమార్కుడు’ను రీమేక్‌ చేశాడు. కాగా ఈ నూతన చిత్రం అజిత్‌ పుట్టినరోజు కానుకగా మే 1వ తేదీన ప్రారంభం కానుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ