Advertisementt

అఖిల్ సినిమాలో రాశిఖన్నా లేదట..!

Tue 24th Mar 2015 11:48 AM
rashi khanna,jil movie,item song,akhil movie  అఖిల్ సినిమాలో రాశిఖన్నా లేదట..!
అఖిల్ సినిమాలో రాశిఖన్నా లేదట..!
Advertisement
Ads by CJ

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకొని వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'జిల్' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఐటెం సాంగ్ లో నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ సాంగ్ కూడా అఖిల్ సినిమాలో అనేసరికి రాశి హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలమైన అప్పుడే ఐటెం సాంగ్స్ చేసే రేంజుకు ఎదిగిపోయిందని కొందరు గుసగుసలాడుకున్నారు. కానీ రాశి మాత్రం తను ఎలాంటి ఐటెం సాంగ్ లో నటించట్లేదని, అసలు అలాంటి ఆఫర్ తన దగ్గరికి రాలేదని కాస్త సీరియస్ అవుతోందట. ప్రస్తుతం హీరోయిన్ గా తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని అప్పుడే ఐటెం సాంగ్స్ లో నటించనని తేల్చి చెప్పేసిందట. దీంతో అఖిల్ సినిమాలో రాశి లేదని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ