యాంకర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది హీరోయిన్ స్వాతి. 100% లవ్ సినిమాతో సింగర్ గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఆ సినిమాలో ఆమె పాడిన ఏ స్క్వేర్, బి స్క్వేర్ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన 'స్వామిరారా' సినిమాలో కూడా ఓ పాట పాడి ప్రేక్షకులను మెప్పించింది. అయితే తాజాగా ఈ అమ్మడు మరోసారి తన పాటతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోందట. తమిళంలో జయం రవి, త్రిష, అంజలి ప్రధాన పాత్రల్లో 'అప్పటక్కర్' అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నాడు. అయితే స్వాతి వాయిస్ ఈ పాటకు సరిగ్గా సరిపోతుందని అందుకే స్వాతితో ఈ పాట పాడిస్తున్నానని తమన్ తెలిపారు. మరో విషయం ఏమిటంటే స్వాతితో పాటు శింబు కూడా ఈ పాటలో స్వరం కలపనున్నాడు. మరి స్వాతి-శింబు లు ఎలాంటి పాటను ప్రేక్షకులకు అందిస్తారో వేచిచూడాలి..!