తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రీదేవి. తెలుగు సినిమాలలో నటించి తరువాత బాలీవుడ్ కు తన మకాం మార్చింది. అక్కడే నిర్మాత బోణీకపూర్ ను పెళ్ళాడి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇంగ్లీష్ వింగ్లిష్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ సుందరికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'పులి' సినిమాలో మహారాణి పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రలో నటించడానికి సుమారుగా 2 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ లో ప్రముఖ యాడ్ ఫిలింమేకర్ రూపొందిస్తున్న తల్లీ కూతురు కథలో తల్లి పాత్రలో నటించమని శ్రీదేవి ని సంప్రదించగా ఆమె 5 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాత అంగీకరించారని తెలుస్తోంది.