Advertisementt

చౌదరి రేయ్ కి అల్లు అర్జున్ పోటు!

Tue 24th Mar 2015 02:36 AM
  చౌదరి రేయ్ కి అల్లు అర్జున్ పోటు!
చౌదరి రేయ్ కి అల్లు అర్జున్ పోటు!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకనిర్మాత వైవిఎస్‌ చౌదరి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురీది తీసిన చిత్రం ‘రేయ్‌’. అయితే ఈ చిత్రం ప్రారంభమై, సినిమా పూర్తై ఇంతకాలం అయినా ఆర్దిక ఇబ్బందుల వల్ల సినిమా విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే చౌదరిని ఒక్క భయం మాత్రం వెంటాడుతోంది. తన ‘రేయ్‌’ చిత్రం విడుదలైన వారం రోజుల గ్యాప్‌లోనే మరో మెగా హీరో అల్లుఅర్జున్‌ నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం విడుదల కానుండటంతో తన సినిమా కేవలం వారం రోజులు మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుందని, మెగాభిమానులు సాయిధరమ్‌తేజ్‌ నటించిన ‘రేయ్‌’ కంటే అల్లుఅర్జున్‌ నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’కే ఎక్కువ మక్కువ చూపుతారని, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం ఏప్రిల్‌ 2న వస్తే తనకు కష్టాలు తప్పవని ఆయన భావన. అయితే పోస్ట్‌ప్రొడక్షన్‌ విషయాల్లో లేటవుతుందనే కారణాన్ని చూపి ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ని ఓ వారం గ్యాప్‌ తర్వాత అంటే ఏప్రిల్‌ 8న విడుదల చేసే అవకాశం ఉందని, ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అందులోనూ ఏప్రిల్‌8న బన్నీ బర్త్‌డే కూడా! దీంతో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం విడుదల ఎప్పుడు? అనే దానిపైనే ‘రేయ్‌’ భవిష్యత్తు ఆధారపడివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ