Advertisementt

తుపాకీ తో తేల్చుకోలేక పోతున్ననిర్మాత!

Tue 24th Mar 2015 02:35 AM
  తుపాకీ తో తేల్చుకోలేక పోతున్ననిర్మాత!
తుపాకీ తో తేల్చుకోలేక పోతున్ననిర్మాత!
Advertisement
Ads by CJ

విజయ్‌-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తమిళంలో వచ్చిన ‘కత్తి’ చిత్రం అక్కడ ఘనవిజయం సాధించింది. దీంతో ఈ చిత్రం తెలుగు హక్కులను ఠాగూర్‌ మధు తీసుకున్నాడు. మొదట్లో అనువాదం చేద్దామని అనుకున్నప్పటికీ ఇంత మంచి సినిమాను అనువాదం చేయడం కంటే మన స్టార్‌ హీరోలతో రీమేక్‌ చేయడమే లాభదాయమనే నిర్ణయానికి వచ్చాడు. ఆల్‌రెడీ పవన్‌కల్యాణ్‌తో పాటు మరికొందరు స్టార్‌ హీరోలకు సినిమా చూపించాడు. కానీ ఎవ్వరూ ఓకే అనలేదు. పోనీ డబ్బింగ్‌ చేద్దామా? అంటే విజయ్‌కు తెలుగులో మార్కెట్‌ లేదు. అందువల్ల డబ్బింగ్‌ చేస్తే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. కాగా ఇప్పటికీ ఠాగూర్‌మధు తన ఆశ విడువలేదని, తెలుగు స్టార్‌ హీరోలలో ఎవరో ఒకరి చేత ఈ సినిమా చేయించాలనే ప్రయత్నాల్లో మునిగిపోయి ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.