తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న నటి సమంత. తెలుగుతో పాటు తమిళ సినిమాలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో తను నటించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలకు రెడీ అవుతుండగా, తమిళంలో '10 ఎనరుదుకుల్' అనే చిత్రంలో నటిస్తుంది. గతంలో సమంత సిద్ధార్థ్ లు ప్రేమించుకొని తరువాత విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా సమంత ఓ బిజినెస్ మెన్ తో చాలా క్లోజ్ గా ఉంటుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయనకి సినీ రంగంతో పరిచయాలు ఉన్నాయని, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ కూడా చేసాడని తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో కొందరు సమంత ఆయనతో సహజీవనం చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తేలాల్సి ఉంది..!