Advertisementt

70కోట్లతో జూదం ఆడుతోన్న గుణశేఖర్‌!

Mon 23rd Mar 2015 05:11 AM
gunasekhar,rudhramadevi,joodam,heavy budget,bahubali,70 crores  70కోట్లతో జూదం ఆడుతోన్న గుణశేఖర్‌!
70కోట్లతో జూదం ఆడుతోన్న గుణశేఖర్‌!
Advertisement
Ads by CJ

నేడు టాలీవుడ్‌లో పెద్ద పెద్ద స్టార్‌ హీరోల చిత్రాలు కూడా కేవలం 50, 60కోట్ల వసూళ్ల దగ్గర ఆగిపోతున్నాయి. అయితే గుణశేఖర్‌ తీస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి 70కోట్ల బడ్జెట్‌ అయిందని నిర్మాత, దర్శకుడైన గుణశేఖర్‌ ప్రకటించాడు. దీంతో సినిమా గురించి కనీస పరిజ్ఞానం ఉన్న వారు కూడా అది ఖచ్చితంగా జూదమే అంటున్నారు. పెద్ద పెద్ద స్టార్‌ హీరోలు సినిమాలకు కూడా పెట్టనంత బడ్జెట్‌ను ‘రుద్రమదేవి’పై పెట్టుబడి పెట్టడం నిజంగా సాహసమే అనాలి.‘బాహుబలి’కి అంత బడ్జెట్‌ పెట్టడంలో ఓ అర్దం ఉంది. రాజమౌళి ట్రాక్‌రికార్డ్‌కు తోడు ప్రభాస్‌ అండదండలు, స్టార్‌ ఇమేజ్‌ ఈ చిత్రానికి ఉపయోగపడుతాయి. కానీ ‘రుద్రమదేవి’ చిత్రం పూర్తిగా చారిత్రక సినిమా కాబట్టి అందరినీ అలరించే సన్నివేశాలను, ఇతర మసాలాలు అందిస్తే అది విమర్శల పాలవుతుంది. ‘బాహుబలి’ మాత్రం కాల్పనిక కథ కావడంతో చిత్రానికి ఏయే కమర్షియల్‌ హంగులు కావాలో వాటన్నింటినీ సినిమాలో ఏర్చికూర్చవచ్చు. 70కోట్ల బడ్జెట్‌ అంటే సినిమా బిజినెస్‌ ఇప్పటికే ఊపందుకోవాలి. ఇప్పటికే సినిమాకు విపరీతమైనహైప్‌ రావాలి. కానీ అది జరగటం లేదు. ఇక ‘రుద్రమదేవి’కి కనీస లాభాలు రావాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా 100కోట్లు వసూలు చేస్తేనే సాధ్యం అవుతుంది. కాగా ‘రుద్రమదేవి’లో అనుష్క`రానా జంటగా నటిస్తున్నారు. ‘రుద్రమదేవి`చాళుక్య వీరభద్రుడి కుమార్తె ముమ్మిడమ్మగా నిత్యామీనన్‌ నటిస్తుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ