Advertisementt

‘బాహుబలి’ అనుకున్న తేదీకి వస్తుందా?

Mon 23rd Mar 2015 04:45 AM
bahubali,release date,ss rajamouli,prabhas  ‘బాహుబలి’ అనుకున్న తేదీకి వస్తుందా?
‘బాహుబలి’ అనుకున్న తేదీకి వస్తుందా?
Advertisement
Ads by CJ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న రాజమౌళి`ప్రభాస్‌ల ‘బాహుబలి’ చిత్రం శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయ్యే వరకు అంటే మరో రెండు నెలల వరకు ఎవ్వరూ రెస్ట్‌ తీసుకోవడానికి వీలు లేదని, ఈ రెండు నెలలు యూనిట్‌లోని ఎవ్వరికీ సెలవులు లేవని రాజమౌళి ప్రకటించాడు. కాగా ‘బాహుబలి’ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలనే భావనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నందువల్ల ఈ చిత్రం విడుదల తేదీలపై కుస్తీ పడాల్సివస్తోందని సమాచారం. త్వరలో ఐపిఎస్‌ ప్రారంభం కానుంది. ముఖ్యంగా మే 15వ తేదీ సమయంలో ఈ సీజన్‌కు సంబంధించిన ఐపిఎల్‌ క్వార్టర్‌ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ జరుగుతాయి. ఈ ఎఫెక్ట్‌ తమ చిత్రంపై పడకూడదనే నిర్ణయానికి రాజమౌళి రావచ్చునని, ఆయన అన్నీ పక్కాగా ఆలోచిస్తాడు కాబట్టి జూన్‌ నెలకి ఈ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ