మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్ ఓ మధ్యతరగతి కుర్రాడిలా కనిపిస్తాడట. స్టంట్ మాస్టర్‌గా నటిస్తూ.... హీరోలకు డూప్‌గా నటిస్తాడని తెలుస్తోంది. ఇందుకోసం రామ్‌చరన్ ఈ మద్య కొంతకాలం ఓ స్టంట్ మాస్టర్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయాలని నిర్మాత దర్శకులు భావిస్తున్నారు.