Advertisementt

గీతాంజలి నుండి ‘చిత్రాంగద’ గా అంజలి!

Sat 21st Mar 2015 03:18 PM
geethanjali,chitrangada,anjali,anjali new film  గీతాంజలి నుండి ‘చిత్రాంగద’ గా అంజలి!
గీతాంజలి నుండి ‘చిత్రాంగద’ గా అంజలి!
Advertisement
Ads by CJ

‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కథానాయిక అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గంగపట్నం శ్రీధర్ నిర్మాత. కాగా ఈ చిత్రానికి ‘చిత్రాంగద’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. అరవైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత శ్రీధర్ తెలియజేస్తూ ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అంజలికి లేడీ కథానాయిక చిత్రాల ఆఫర్లు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మా కథ విన్న వెంటనే ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘గీతాంజలి’ తరహాలోనే ఇది కూడా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో, పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ఈ చిత్రంలో ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని పలు అంశాలు వుంటాయి. కథ డిమాండ్ మేరకు ఎక్కువభాగం అమెరికాలో చిత్రీకరణ జరిపాం. బ్యాలెన్స్‌గా వున్న పాటలను యూరప్, కేరళలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. వేసవిలో చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.అంజలి  కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం వుండబోతుంది’ అని తెలిపారు. అంజలి, సప్తగిరి, స్వాతిదీక్షిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేషన్, స్వామినాథన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సమర్పణ: చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ వడపల్లి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ