తెలుగులో ఒక మెయిన్ ఛానల్, రెండు న్యూస్ చానల్స్ తో పాటు ఇతర భాషలలోను చానల్స్ కలిగివున్న నెట్ వర్క్ ఈనాడు. ఇప్పటివరకు ఏ భాషలోను రియాల్టీ షోల కోసం ప్రత్యేకంగా ఎలాంటి చానల్స్ లేవు. ఎంటర్ టైన్మెంట్ చానల్స్ లోనే రియాల్టీ షోలు నిర్వహించారు. రీసెంట్ గా ఈటీవీ సంస్థ జనాలను ఆకట్టుకునే రియాల్టీ షోల కోసం ప్రత్యేకంగా ఓ చానల్ పెట్టే ఆలోచనలో ఉందట. ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు కూడా దీనికి అంగీకరించారని సమాచారం. సినిమాలు, సీరియళ్ళ కంటే రియాల్టీ షోలనే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఈటీవీ సంస్థ భారీ ఎత్తున ఈ చానెల్ ను ప్రారంభించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.