‘ముకుంద’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ మొదటి చిత్రంతో మంచి మార్కులే సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన తన రెండో చిత్రంలో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా మెగాభిమానులు ఇష్టపడే మాస్‌లుక్ లేనప్పటికీ తనదైన ప్రత్యేక శైలిలో ఉన్న వరుణ్‌తేజ్ లుక్ అందరికీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఓ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుందని, ఇందులో స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ప్రేమకథ ప్రధానాంశంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రానికి ‘కంచె’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌కు జోడీగా ‘మిర్చిలాంటి కుర్రాడు’ ఫేమ్ ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం కోసం రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.