మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హీరో రాజేంద్రప్రసాద్‌కు పోటీగా మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ కూడా రంగంలోకి దిగడంతో ఏకపక్షమనుకున్న ఎన్నికలు ఇప్పుడు పోటాపోటీగా మారాయి. అయితే ఇప్పటికే పలువురు సినీ పెద్దలు రాజేంద్రప్రసాద్‌కు మద్దతు పలికారు. ఇక మెగా ఫ్యామిలీ తరఫున నాగబాబు రాజేంద్రప్రసాద్‌కు మద్దతు తెలిపారు. కాస్త ఆలస్యంగా జయసుధ పోటీలోకి రావడం రాజేంద్రప్రసాద్‌కు కలిసొచ్చింది. ఇక గతంలో 'మా' అధ్యక్ష పదవికి ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగాయి. ఈసారి మాత్రం రాజేంద్రప్రసాద్, జయసుధల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరిలో గెలుపు ఎవరిదనే విషయం మార్చి 29న తేలనుంది.