Advertisementt

ఇక నుంచి ఆయన బిరుదు మెగాసుప్రీంహీరో..!

Thu 19th Mar 2015 10:52 AM
sai dharam tej,rey,mega supreme star,mega supreme  ఇక నుంచి ఆయన బిరుదు మెగాసుప్రీంహీరో..!
ఇక నుంచి ఆయన బిరుదు మెగాసుప్రీంహీరో..!
Advertisement
Ads by CJ

మెగా మేనల్లుడుగా పరిశ్రమకు పరిచయమైన హీరో సాయిదరమ్‌తేజ్‌. ఆయన మొదటి చిత్రం ‘రేయ్‌’ ఎంతకీ విడుదలకాకపోవడంతో ఆయన నటించిన రెండో చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో పరిశ్రమకు, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తొలిసినిమాతో ఫర్వాలేదనిపించుకున్న ఆయన నటించిన తొలి చిత్రం ‘రేయ్‌’ ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం నుండి ఆయన టైటిల్‌ కార్డ్స్‌లో ‘మెగా సుప్రీం స్టార్‌’గా సంబోదించనున్నారు. ఇదే బిరుదును ‘రేయ్‌’ చిత్రం సినిమా స్క్రీన్లపై కూడా వీక్షించవచ్చు. వచ్చి ఒకటి రెండు చిత్రాలు కాలేదు.. అప్పుడే సాయిదరమ్‌తేజ్‌కి మెగాస్టార్‌లోని మెగా, ఒకప్పటి సుప్రీం హీరోలోని సుప్రీం పదాలను చేర్చి అభిమానులు మెగా సుప్రీంస్టార్‌గా బిరుదు ఇవ్వడాన్ని కొందరు జోక్‌గా తీసుకుంటుండగా, మెగాభిమానులు మాత్రం అందరూ చేస్తున్న పనే మేమూ చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ