Advertisementt

తమన్‌ దరువు కావాలంటున్న సూర్య...!

Thu 19th Mar 2015 07:55 AM
thaman music,mass tunes,hero surya,mass movie  తమన్‌ దరువు కావాలంటున్న సూర్య...!
తమన్‌ దరువు కావాలంటున్న సూర్య...!
Advertisement
Ads by CJ

తమన్‌ సంగీతంలో రణగొణధ్వనులు తప్ప మరేం వినిపించవు. ఆ ఫాస్ట్‌బీట్‌లో సాహిత్యం చితికిపోతుంటుంది. అదేంపాటరా..బాబూ... అనుకొంటే వాటికి మన హీరోలు వేసే వెర్రి గంతులు నవ్వు తెప్పిస్తుంటాయి. మాస్‌ ప్రేక్షకులకు అవే కావాలి కాబట్టి తమన్‌ బండి సాఫీగా సాగుతోంది. కాగా తమిళ స్టార్‌ హీరో సూర్యకు ఇప్పుడు తమన్‌ అర్జంట్‌గా కావాలి. ఎందుకంటే తన చిత్రం పేరే ‘మాస్‌’ కాబట్టి ఓ పాటలోనైనా ఆ మాస్‌ దంపుడు ఉండాలి కదా! అందుకే సూర్యకు తమన్‌ గుర్తొచ్చాడు. వాస్తవానికి ‘మాస్‌’ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకుడు. కానీ సూర్య మాత్రం తనకి ఓ పాట కంపోజ్‌ చేయమని తమన్‌ను అడగటం, దానికి తమన్‌ యధావిధిగా దరువేయడం జరిగిపోయాయి. మరి తమన్‌ అందిస్తున్న పాట ఎలా ఉంటుందో ‘మాస్‌’లో చూడాల్సిందే అంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ