నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు చదువుకొంటూనే మరోపక్క నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి అంశాలలో ఆయన శిక్షణ పొందుతున్నాడు. తన తాతయ్య నటించిన పలు చిత్రాల సీడీలను చూస్తూ, ఆయన డైలాగ్‌డెలివరి, బాడీలాంగ్వేజ్ వంటివాటిలో తర్ఫీదు పొందుతున్నాడు. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం పూర్తయిన వెంటనే మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఖరారు కానుంది. అంటే 2016లో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా అరంగేట్రం చేసిన సినిమా విడుదలైన వెంటనే ఈ చిత్రం దర్శకుడిని ఎంపిక చేస్తారట. బహుశా ఆ చిత్రం హిట్టయితే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా వినాయక్ దర్శకత్వంలోనే జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.