Advertisementt

మహేష్‌ చిత్రంపై క్లారిటీ...!

Thu 19th Mar 2015 07:52 AM
mahesh babu,koratala shiva,sreekanth addala,pvp  మహేష్‌ చిత్రంపై క్లారిటీ...!
మహేష్‌ చిత్రంపై క్లారిటీ...!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ ‘బ్రహ్మోత్సవం’ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం లేటవుతుందని, ముందుకు మహేష్‌ త్రివిక్రమ్‌తో కానీ లేదా పూరీజగన్నాథ్‌తో గానీ చేస్తాడని... కొరటాల శివతో చేస్తున్నది ఫ్యామిలీ చిత్రం కాబట్టి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో వెంటనే మరో ఫ్యామిలీ సినిమా వెంటనే చేయడని వార్తలు పుట్టుకొచ్చాయి. కాబట్టి ‘బ్రహ్మోత్సవం’ మరింత లేటవుతుందని లాజిక్కులు కూడా మొదలయ్యాయి. అయితే నిర్మాత పివిపి మాత్రం ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. మహేష్‌తో తన తదుపరి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ అని స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ చిత్రీకరణకు వెళ్లబోతోందని ఆయన ప్రకటించాడు. దాంతో ఇప్పుడు అందరికీ దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. మహేష్‌ తదుపరి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ అని, మిగిలిన చిత్రాలు ఆ తర్వాతే అని తేలిపోయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ