Advertisementt

పవన్ కొడుకు పేరుతో మురుగదాస్ సినిమా..!

Wed 18th Mar 2015 01:59 PM
murugadas,pawan kalyan,akeera nandan,sonakshi sinha  పవన్ కొడుకు పేరుతో మురుగదాస్ సినిమా..!
పవన్ కొడుకు పేరుతో మురుగదాస్ సినిమా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంటే అతని కుమారుడు అకీరా నందన్ పేరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 'గజినీ' , 'కత్తి' లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలని డైరెక్ట్ చేసిన దర్శకుడు మురుగుదాస్ రీసెంట్ గా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. అయితే ఈ చిత్రానికి 'అకీరా' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. 'అకీరా' అంటే 'గ్రేస్ ఫుల్ స్త్రెంగ్థ్' అని అర్ధం. అసలు ‘అకీరా' సినిమాకు, పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఎలాంటి సంబంధం లేదని,  ఈ టైటిల్ పెట్టింది పవన్ కళ్యాన్ కొడుకుని దృష్టిలో ఉంచుకుని కాదని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నారు. అఖీరా కురసోవా అనే ప్రపంచ ప్రఖ్యాత జపనీస్ దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమాకు టైటిల్ పెట్టి ఉంటాడని అంటున్నారు. ఈ సినిమాలో సోనాక్షి తండ్రి కూడా నటించడం విశేషం. ఆయన పాత్ర చిన్నదే అయినా ఓ ముఖ్యమైన పాత్ర అని తెలుస్తోంది. తమిళంలో వచ్చిన 'మౌన గురు' అనే సినిమాకు రీమేక్ చిత్రమిది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ