వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశాడు. ఈసారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోంది. అదే విధంగా యాపిల్ మహిళలను కూడా తయారుచేయాలని సిన్సియర్‌గా కోరుకుంటున్నాను.. అంటూ వివాదాస్పద ట్వీట్ చేశాడు. మరోవైపు నాస్తికుడైన వర్మ ఈసారి లక్ష్మీదేవిని ఉద్దేశించి ట్వీట్టు వదిలాడు. అసలు లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో మనకంటే ఎక్కువ డబ్బుదంటే.. అది లక్ష్మీదేవి లోపమా?లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా? అంటూ ట్వీట్ చేశాడు.