Advertisementt

దిల్‌రాజు జాక్‌పాట్‌ కొట్టనున్నాడా....?

Tue 17th Mar 2015 01:41 PM
dil raju,allu arjun,son of sathyamurthy,trivikram  దిల్‌రాజు జాక్‌పాట్‌ కొట్టనున్నాడా....?
దిల్‌రాజు జాక్‌పాట్‌ కొట్టనున్నాడా....?
Advertisement
Ads by CJ

ఈమద్య దిల్‌రాజు ఆర్దికంగా చాలాకోల్పోయాడు. అయితే ఈ ఏడాది జనవరిలో విడుదలైన నందమూరి కళ్యాణ్‌రామ్‌ ‘పటాస్‌’తో జాక్‌పాట్‌ కొట్టాడు. త్వరలో ఆయన మరో జాక్‌పాట్‌ కొట్టనున్నాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. అల్లుఅర్జున్‌`త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం నైజాం రైట్స్‌ను దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. దాదాపు 13కోట్ల పైన చెల్లించి ఆయన ఈ రైట్స్‌ను కొన్నాడని ట్రేడ్‌ వర్గాల మాట. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌లకు మంచి స్పందన వస్తుండటం, సినిమాపై భారీ అంచనాలు నెలకొనివుండటం, ఈ చిత్రం విడుదలైన రెండు మూడు వారాల వరకు మరోపెద్ద చిత్రం వచ్చే అవకాశం లేకపోవడం, అల్లుఅర్జున్‌ స్టైల్‌, త్రివిక్రమ్‌ మార్క్‌, సినిమా ముఖ్యంగా ఫ్యామిలీలను టార్గెట్‌ చేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌తో పాటు స్టడీ రన్‌ కూడా ఉంటుందనే నమ్మకంతోనే దిల్‌రాజు అంత మొత్తాన్ని పెట్టాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ