Advertisementt

త్రివిక్రమ్‌కు లాంగ్‌ గ్యాప్‌ తప్పదా...!

Mon 16th Mar 2015 07:26 AM
trivikram sreenivas,allu arjun,son of sathyamurthy,long gap  త్రివిక్రమ్‌కు లాంగ్‌ గ్యాప్‌ తప్పదా...!
త్రివిక్రమ్‌కు లాంగ్‌ గ్యాప్‌ తప్పదా...!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు మాటల మాంత్రికుడు, దర్శకమరాఠి త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ రెండుమూడేళ్లకో ఓ సినిమా చేసేవాడు. కానీ ఈమద్య ఆయన వేగంగా చిత్రాలు తీస్తున్నాడు. స్క్రిప్ట్‌కు ఎక్కువ సమయం తీసుకొంటున్నప్పటికీ షూటింగ్‌ను మాత్రం వేగంగా, పక్కా ప్లానింగ్‌తో తీసేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అల్లుఅర్జున్‌ హీరోగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రం చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ ఎవరితో సినిమా చేయనున్నాడు? అంటే మాత్రం ఎవ్వరి దగ్గరా సమాధానం లభించడం లేదు. దాదాపు మన స్టార్‌ హీరోలందరూ మరో ఏడాది పాటు బిజీగా ఉంటున్నారు. ఎన్టీఆర్‌ సుకుమార్‌ చిత్రంతో, మహేష్‌బాబు ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం’ చిత్రాలతో, ప్రభాస్‌ సుజీత్‌  దర్శకత్వంతో, రామ్‌చరణ్‌ శ్రీనువైట్ల చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి వెనువెంటనే త్రివిక్రమ్‌ ఏ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కనిపించడం లేదు. పోనీ పవన్‌తో ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్‌ ‘కోబలి’ తీద్దామంటే పవన్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ అర్థం కాదు. ‘గబ్బర్‌సింగ్‌2’ ఉందా? లేదా? అన్న దానిపై పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా ఆధారపడివుంది. ఇక ఆయనకు మిగిలిన ఛాన్స్‌ ఏమిటంటే... పవన్‌ నిర్మాతగా రామ్‌చరణ్‌ హీరోగా చేయబోయే సబ్జెక్ట్‌ మీద ఐదారునెలలు కూర్చొని రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల సినిమా పూర్తయిన వెంటనే షూటింగ్‌ను మొదలుపెట్టడమే ఆయనకున్న బెస్ట్‌ ఆప్షన్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ