నిన్నటి వరకు హిట్ దర్శకుల వెంటపడిన మన స్టార్‌హీరోల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. హిట్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా స్టోరీకి, డైరెక్టర్ టాలెంట్‌కు విలువ ఇస్తున్నారు. ఇది టాలీవుడ్‌కు శుభపరిణామం అనే చెప్పాలి. దీనికి మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి వారు ముందుకు రావడం హర్షణీయం. ‘ఆగడు’ వంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా చేస్తున్నాడు. ఇక ‘ముకుంద’ వంటి జస్ట్ యావరేజ్ చిత్రం తర్వాత కూడా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ‘1’(నేనొక్కడినే) వంటి భారీ డిజాస్టర్ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ మీద నమ్మకంతో ఆయన దర్శకత్వంలో నటించనున్నాడు. ఇలా మన స్టార్‌హీరోల ఆలోచనావిధానంలో మార్పు రావడం అందరికీ ఆనందాన్ని కలుగజేసే అంశం అని చెప్పవచ్చు.