అల్లుఅర్జున్ సినిమా అంటే అందులో కనీసం ఒక్కటైనా ఫాస్ట్‌బీట్‌తో సాగే పక్కామాస్ సాంగ్ ఉంటుంది. ఇక అల్లుఅర్జున్‌కు దేవిశ్రీప్రసాద్‌తోడైతే ఇక ఆ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ‘అ అంటే అమలాపురం...’ నుండి ‘సినిమా సూపిత్త మామా...’ వరకు బన్నీ కెరీర్‌లో అన్ని చిత్రాల్లో అలాంటి ఓ పాట ఉండితీరుతుంది. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రం టైటిల్, క్యాప్షన్ క్లాస్‌గా ఉన్నప్పటికీ ఇప్పటివరకు అల్లుఅర్జున్ కెరీర్‌లోనే హైలైట్‌గా నిలిచే ఓ పక్కా మాస్ పాట ఉందని సమాచారం. ఈ పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులను సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈపాట ‘అ.. అంటే అమలాపురం...’పాటకు రెండిరతలు ఎక్కువగా ఉంటుందని, బన్నీ ఈ పాటలో ఇరగదీశాడని అంటున్నారు. మరి ఆ పాట తెరపై ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే...!