బండ్ల గణేష్ నిర్మాతగా మారిన తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల డేట్స్ సంపాదిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాడు. అయితే ‘టెంపర్’ చిత్రం తర్వాత మాత్రం ఆయన తన తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఈ సారి గణేష్ ఎవరి డేట్స్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అనే విషయం ఆసక్తిని రేపుతోంది. ఎట్టకేలకు ఆయన నితిన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వం వహించే చిత్రాన్ని నిర్మించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసిన ఈ బడా నిర్మాత, బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయం ఆసక్తిని రేపుతోంది.