ఒకప్పుడు కమల్‌హాసన్ సినిమా అంటే అది డబ్బింగా? లేక స్ట్రెయిట్ చిత్రమా? అనేది పట్టించుకోకుండా మన తెలుగు ప్రేక్షకులు ఆయన సినిమాలను ఎంతో ఆదరించేవారు. కానీ ఈమధ్య కమల్‌హాసన్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గుతోంది. మునుపటిలోలాగా ఆయన చిత్రాలకు టాలీవుడ్‌లో బిజినెస్ రేంజ్ కూడా పడిపోయింది. కాగా ఈమద్య వచ్చిన ‘విశ్వరూపం’ తమిళంలో కంటే తెలుగులో ముందుగా విడుదలైనప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లపరంగా నిరాశను మాత్రమే మిగిల్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఆయన తాజా చిత్రం ‘ఉత్తమవిలన్’కు ఎదురవుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని ఎవరో కొత్తవారికి కాకుండా సి.కళ్యాణ్ వంటి నిర్మాతకు ఇస్తే ఎంతోకొంత బిజినెస్ జరుగుతుందని కమల్ భావించాడని, అందువల్లే సి.కళ్యాణ్‌కు ఇష్టం లేకపోయినా మొహమాటానికి ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ఒక్క ఏరియా బిజినెస్ కూడా జరుగలేదని సమాచారం. మరి ఈ చిత్రం విడుదలకానున్న ఏప్రిల్ 10వ తేదీకి ఏమాత్రం బిజినెస్ జరుగుతుందో వేచిచూడాలి....!