అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సన్నాఫ్‌సత్యమూర్తి’ చిత్రంలో బన్నీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం విడుదలైన వెంటనే బన్నీ బోయపాటిశ్రీను కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ నిర్మించే చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో కూడా సమంతను హీరోయిన్‌గా తీసుకుంటారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. వాస్తవానికి దర్శకుడు బోయపాటి హీరోయిన్‌గా సమంత పేరును సూచించిన మాట వాస్తవమే అని.. అయితే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత వెంటనే మరలా సమంతతో నటించడం కంటే రకుల్‌ప్రీత్‌సింగ్‌ను తీసుకుంటే ఫ్రెష్‌లుక్ ఉంటుందని బన్నీ చెప్పాడని, దీంతో బోయపాటి కూడా రకుల్‌ను పెట్టుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడనేది ఫిల్మ్‌నగర్ సమాచారం.