అల్లువారి కుర్రాడు అల్లుశిరీష్ త్వరలో పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం శిరీష్ తెగ కష్టపడుతూ.. ఒళ్లు హూనం చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఈ స్టోరీని పరుశురామ్ సునీల్ కోసం తయారుచేసుకున్నాడట. ‘సారొస్తారు’ తర్వాత పరుశురామ్ ఈ స్టోరీ రాసుకున్నాడు. నిర్మాత కూడా దొరికాడు కానీ చివరి క్షణంలో ఆ ప్రొడ్యూసర్ హ్యాండిచ్చాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత పరుశురామ్‌కి గీతాఆర్ట్స్ నుండి పిలుపొచ్చింది. దాంతో పరుశురామ్ తను సునీల్ కోసం తయారుచేసుకున్న స్టోరీని గీతాఆర్ట్స్ వారికి వినిపించాడు. కథ నచ్చడంతో మా శిరీష్‌తో ఈ సినిమా తీసెయ్.. అని గీతాఆర్ట్స్ నుండి ఆర్డర్ వెలువడింది. సరే..ఎవరో ఒకరు దొరికారు కదా! అని పరుశురామ్ సర్దుకుపోయాడు. మరి సునీల్ బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా రాసుకున్న స్టోరీకి అల్లుశిరీష్ ఏ విధంగా న్యాయం చేయగలడో వేచిచూడాల్సివుంది...!